News November 22, 2024

రేపే RESULTS DAY: గుంభనంగా మహారాష్ట్ర

image

మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం గుంభనంగా మారింది. శనివారం ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో అన్ని పార్టీల నేతలు ఆత్రుత చెందుతున్నారు. ఎక్కువ ఎగ్జిట్‌పోల్స్ BJP+ గెలుస్తుందని అంచనా వేసినా మరికొన్ని నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ జరిగిందని చెప్తున్నాయి. దీంతో అసలు ఫలితాలు వెల్లడయ్యేంత వరకు నేతలకు టెన్షన్ తప్పడం లేదు. BJP, కాంగ్రెస్, 2 శివసేనలు, 2 NCPలు లోపల ఆందోళన చెందుతున్నా పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి.

Similar News

News October 20, 2025

మీరు కొన్న టపాసుల హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

image

దీపావళి పిల్లలకు ఒక ఎమోషన్. దాచి పెట్టుకున్న డబ్బులతో పాటు పేరెంట్స్ వద్ద చిన్నపాటి యుద్ధం చేసైనా కావాల్సిన మనీ సాధించి టపాసులు కొనాల్సిందే. పండుగకు ముందు నుంచే రీల్ తుపాకులు, ఉల్లిగడ్డ బాంబులు కాలుస్తూ సంబరపడే బాల్యం దీపావళి రోజు తగ్గేదేలే అంటుంది. క్రాకర్స్ వెలుగుల్లో నవ్వులు చిందించే పిల్లల ముఖాలు చూసి పేరెంట్స్ సైతం మురిసిపోతారు. ఇంతకీ చిన్నప్పుడు మీరు కొన్న క్రాకర్స్ హయ్యెస్ట్ ప్రైస్ ఎంత?

News October 20, 2025

దీపావళి.. లక్ష్మీ పూజకు ముహూర్తం ఇదే

image

ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దీపావళి. ఇవాళ లక్ష్మీపూజ, పితృదేవతలకు దివిటీ చూపించడం, దీపదానం వంటివి చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సా.7 నుంచి రా.8.30 మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి మంచి సమయమని పేర్కొంటున్నారు. ప్రదోష కాల సమయం సా.5.45-రా.8.15 మధ్య చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు.

News October 20, 2025

దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

image

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.