News November 23, 2024
ఫలితాల్ని ఊహించలేదు: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఫలితాల్ని ఊహించలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓటమిపై సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇండియా కూటమి సాధించిన ఈ విజయం రాజ్యాంగ పరిరక్షణతోపాటు సహజ వనరుల పరిరక్షణ విజయంగా అభివర్ణించారు. ఝార్ఖండ్‌లో JMM 28 సీట్లలో గెలిచి మరో 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 11 చోట్ల గెలిచి 5 చోట్ల లీడ్‌లో ఉంది.
Similar News
News November 23, 2024
తీవ్ర ఉత్కంఠ.. నాందేడ్‌లో కాంగ్రెస్ విజయం
MHలోని నాందేడ్ లోక్‌సభ సీటు ఉపఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠ రేపింది. BJP, కాంగ్రెస్ మధ్య విజయం దోబూచులాడింది. చివరకు 1,457 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్‌రావ్ గెలిచారు. రవీంద్రకు 5,86,788 ఓట్లు రాగా, BJP అభ్యర్థి సంతుక్రావ్ హంబార్డేకు 5,85,331 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ వసంతరావ్ చవాన్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఆయన కుమారుడు రవీంద్రకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
News November 23, 2024
అదృష్టం: 162 ఓట్లతో గెలిచాడు!
మహారాష్ట్రలోని మాలేగావ్ సెంట్రల్ నియోజకవర్గంలో MIM పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఇస్మాయిల్ అబ్దుల్ కేవలం 162 ఓట్ల తేడాతో గెలిచారు. ఇస్మాయిల్‌కు 1,09,653 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన ఆసిఫ్ షేక్ రషీద్ (ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర పార్టీ)కు 1,09,491 ఓట్లు పోలయ్యాయి. ఆ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. MHలో MIM 16 సీట్లలో పోటీ చేయగా గెలిచిన ఏకైక సీటు ఇదే.
News November 23, 2024
15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలి: మంత్రి పొన్నం
ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా రవాణా శాఖ ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. స్కూల్ బస్సులను నిరంతరం తనిఖీలు చేస్తూ, 15 ఏళ్లు దాటిన వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. ఈవీ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఉన్నతాధికారుల సమీక్షలో సూచించారు. రవాణా శాఖకు ప్రత్యేక లోగో రాబోతుందని వివరించారు. ఈ శాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు పూర్తి చేయాలన్నారు.