News August 25, 2025

స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

image

AP: RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. 11,702మంది ఎంపిక కాగా, ఆగస్టు 31లోపు విద్యార్థులు స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అందుతుందని చెప్పింది. ఈ <>వెబ్‌సైట్‌<<>>లోనూ చెక్ చేసుకోవచ్చని వివరించింది.

Similar News

News August 25, 2025

లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

image

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.

News August 25, 2025

కొరత ఉండదు.. ఆందోళన వద్దు: అచ్చెన్నాయుడు

image

APలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేసి, ఇప్పటివరకు 21.34 లక్షల మె.టన్నులు సరఫరా చేశామ‌న్నారు. ప్రస్తుతం 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, 10,800 మెట్రిక్ టన్నులు ఒడిశా పోర్ట్ నుంచి దిగుమతి అవుతుందని, డిపోల్లోని 79,633 మెట్రిక్ టన్నులను అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.

News August 25, 2025

ఉద్యోగి మెంటల్ హెల్త్ కోసం ‘అన్‌హ్యాపీ లీవ్’

image

చైనాలోని ఓ కంపెనీ అమలుచేస్తోన్న రూల్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ‘అన్‌హ్యాపీ లీవ్’ను తీసుకొచ్చింది. ఉద్యోగి సంతోషంగా లేనప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు దీనిని వాడొచ్చు. ‘నేను సంతోషంగా లేను’ అని చెప్పి లీవ్ పెట్టొచ్చు. ఇలా ఏడాదికి 10 సార్లు లీవ్ తీసుకోవచ్చు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా పనిచేయగలరని సంస్థ నమ్ముతోంది.