News June 2, 2024
Results: నిజమైన ఎగ్జిట్ పోల్స్

ఉత్కంఠ మధ్య నిన్న విడుదలైన India Today Axis My India ఎగ్జిట్ పోల్స్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం విషయంలో నిజమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ఆ సంస్థ అంచనాలకు తగ్గట్టే ఇవాళ తుది రిజల్ట్ వచ్చింది. అరుణాచల్‌లో బీజేపీకి 44-51 మధ్య వచ్చే ఛాన్స్ ఉందని India Today తెలపగా ఫలితాల్లో 46 సీట్లు వచ్చాయి. సిక్కింలో SKM పార్టీకి 24-30 వస్తాయని ప్రిడిక్ట్ చేయగా రిజల్ట్‌లో ఆ పార్టీ 31 సీట్లను కైవసం చేసుకుంది.
Similar News
News January 15, 2026
నేడే పెద్ద పండుగ.. తెలుగు లోగిళ్లలో సంబరాలు

తెలుగు రాష్ట్రాలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియతో భోగభాగ్యాలు వస్తాయని విశ్వసిస్తారు. పంటలు ఇంటికి చేరే వేళ కావడంతో ఇది రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు పల్లెల్ని పండుగ కళతో నింపేస్తాయి. పిండి వంటకాలతో ఇళ్లు పరిమళిస్తాయి. దేశవ్యాప్తంగా పొంగల్, లోహ్రీ, మాఘ బిహు పేర్లతో ఈ పండుగను జరుపుకుంటున్నారు.
News January 15, 2026
నేటి నుంచి అందుబాటులోకి వెస్ట్ బైపాస్

AP: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా-చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్గేట్ జంక్షన్ వరకు ఒకవైపు రహదారిపై అన్ని రకాల వాహనాలకు అనుమతిస్తున్నట్లు NHAI తెలిపింది. గుంటూరు, అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వాహనాలకు ఇది కీలక మార్గంగా మారనుంది.
News January 15, 2026
సంక్రాంతి: ఈ వస్తువులు కొంటే శ్రేయస్సు

సంక్రాంతి వేళ ఇంటికి శ్రేయస్సు తెచ్చే వస్తువులు కొనడం ఎంతో శుభప్రదమంటున్నారు వాస్తు నిపుణులు. ‘ఇంటి ప్రతికూల శక్తిని తొలగించడానికి విండ్ చైమ్స్, ఆర్థిక స్థిరత్వం కోసం ఉత్తర దిశలో లోహపు తాబేలు, అదృష్టం కోసం క్రిస్టల్ వస్తువులు ఉంచాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రధాన ద్వారానికి లక్కీ నాణేలు, దాంపత్య బంధం బలపడటానికి నైరుతి దిశలో మాండరిన్ బాతుల జంటను ఏర్పాటు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.


