News April 22, 2025
కాసేపట్లో ఫలితాలు..

TG: విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కాబోతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మ.12 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే Way2Newsలో చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే బాక్సులో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్డ్ మార్క్స్ లిస్ట్ వస్తుంది. దాన్ని ఈజీగా మీ స్నేహితులకు షేర్ చేయవచ్చు.
Similar News
News April 22, 2025
గంట వ్యవధిలోనే మళ్లీ పెరిగిన బంగారం ధర!

లైవ్ మార్కెట్‌లో బంగారం ధరలు నిమిష-నిమిషానికి మారుతూ ఆల్ టైమ్ రికార్డును చేరుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్షకు చేరగా గంట తేడాలోనే మరోసారి భారీగా పెరిగింది. ఇవాళ ఏకంగా రూ.3వేలు పెరిగి రూ.1,01,350కు చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 పెరిగి రూ.92,900కు చేరింది.
News April 22, 2025
RESULTS: ఆ గ్రూప్ విద్యార్థులకు షాక్

TG: ఇంటర్ ఫలితాల్లో HEC, CEC గ్రూప్ విద్యార్థులు నిరాశపరిచారు. ఫస్టియర్ HECలో 8959 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 3092 మందే (34.51%) పాసయ్యారు. CECలో 92745 మంది హాజరైతే 42259 మంది (45.56%) ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్ HECలో 9031 మంది రాస్తే 4178 మంది (46.26%), CECలో 103713 మంది హాజరైతే 48658 మంది (46.92%) పాస్ అయ్యారు.
News April 22, 2025
రాహుల్ లెటర్‌పై స్పందించిన రేవంత్

TG: రాష్ట్రంలో వేముల రోహిత్ యాక్ట్ తీసుకురావాలన్న కాంగ్రెస్ అగ్రనేత<<16168187>> రాహుల్ గాంధీ<<>> విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హిరోషిమాలో రాహుల్ లేఖను చదివినట్లు పేర్కొన్నారు. చట్టం తీసుకురావాలని కోరడం స్ఫూర్తిదాయకమైన పిలుపు అన్నారు. ఆయన ఆలోచనలు, భావాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.