News November 22, 2024

రేపే ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా..

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలను వే2న్యూస్ యాప్‌లో వేగంగా చూడొచ్చు. శనివారం ఉదయం 8 గంటల నుంచి నాన్-స్టాప్ కవరేజ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫలితాలతో పాటు స్పెషల్ గ్రాఫిక్ ప్లేట్స్, విశ్లేషణాత్మక స్టోరీలు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలో 288, ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉ.9 గంటల కల్లా ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.

Similar News

News February 4, 2026

జట్లు వేరైనా మూలాలు మనవే!

image

FEB 7న మొదలుకానున్న T20 WCలో దాదాపు 35+ భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. USA సారథి మోనాంక్ పటేల్, కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా, ఒమన్ సారథి జతీందర్ సింగ్‌లతో పాటు USA పేసర్ సౌరభ్ వంటి ప్లేయర్స్ విదేశీ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు భారత్-అమెరికా జట్ల మధ్య పోరును నెటిజన్లు ‘పాస్‌పోర్ట్ VS గ్రీన్ కార్డ్’ మ్యాచ్ అని సరదాగా జోకులు పేలుస్తున్నారు.

News February 4, 2026

భార్య అందంగా ఉందని గుండు గీశాడు

image

కర్ణాటలోని బాగల్‌కోట(D)లో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడుగ్గా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా తాగి భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News February 4, 2026

HIVతో ఐదేళ్లలో 44వేల మంది బలి

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2020-24 మధ్య ఐదేళ్లలో 44,140మంది బాధితులు మరణించారని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పటేల్‌ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో 32,642 మంది, తెలంగాణలో 11,498 మంది HIV బాధితులు మరణించారని వెల్లడించారు. ప్రజల్లో పెరిగిన నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం దీనికి కారణమని తెలుస్తోంది.