News September 5, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద PM ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు మళ్లీ సేకరిస్తున్నారు. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకు ఈనెల 9 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 5, 2025

HYDలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది: హరీశ్

image

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హైడ్రాతో ఎన్నారైలను రేవంత్ భయపెట్టారని, దీంతో వారు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలితే రాద్ధాంతం చేస్తున్నారని లండన్ పర్యటనలో మండిపడ్డారు. ఇప్పటికీ బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. రేవంత్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRSదే విజయమన్నారు.

News September 5, 2025

సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్

image

పెట్టుబడుల ఒప్పందాల కోసం యూకే పర్యటనకు వెళ్లిన తమిళనాడు సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. బ్లేజర్, సన్ గ్లాసెస్, ఇన్‌షర్ట్‌తో మెరిశారు. అక్కడి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పెరియార్ స్కెచ్‌ను ఆయన ఆవిష్కరించారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్ రాయిస్ కంపెనీ తమిళనాడులోని హోసూర్‌లో డిఫెన్స్ ఇంజిన్స్ తయారు చేసేందుకు స్టాలిన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.

News September 5, 2025

విజ్ఞానం వైపు నడిపే వెలుగే గురువు

image

త్రిమూర్తుల కన్నా సృష్టికర్త బ్రహ్మకన్నా గురువే గొప్పవాడంటారు. ఎందుకంటే ఒక విద్యార్థిని అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపే మార్గదర్శి ఆ గురువే కాబట్టి. బుద్ధులు నేర్పుతాడు.. బుద్ధిమంతుడిని చేస్తాడు. విద్యార్థి విజయాలనే తన గురు దక్షిణగా భావిస్తాడు. అలాంటి గురువులను మన జీవితంలో కలిగి ఉండటం అదృష్టంగా భావించాలి. ఏమిచ్చినా, ఎన్ని సేవలు చేసినా వారి రుణం తీర్చుకోలేం. అందరికీ గురుపూజోత్సవం శుభాకాంక్షలు.