News October 15, 2024
భూముల రీసర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP: భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Similar News
News November 24, 2025
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బ్రాహ్మణుల నిరసన

బ్రాహ్మణులను కించపరిచేలా పాట పాడిన జీడీ నరసయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. జీడి నరసయ్యపై వెంటనే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చూడాలని కోరారు.
News November 24, 2025
ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్‌కు లింక్ అయ్యేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్మీట్లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.


