News September 25, 2024

‘రిటైల్ వ్యాపారుల ఆరోపణలు సరికావు’

image

విక్రయదారులకు కేవలం వేదికగా మాత్రమే అమెజాన్ ఉందని ఆ సంస్థ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. వ్యాపారులే ధరల్ని నిర్ణయిస్తారని చెప్పారు. భారీ రాయితీలు తమ అమ్మకాలను దెబ్బతీస్తోందన్న రిటైల్ వ్యాపారుల ఆరోపణలు సరికావన్నారు. భారత్‌లో గతేడాది కంటే ప్రస్తుత పండుగల సీజన్‌లో విక్రయాలు బాగుంటాయని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా 1,10,000 మంది తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు చెప్పారు.

Similar News

News September 25, 2024

రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డుల రద్దు?

image

TG: రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

News September 25, 2024

దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ

image

TG: దసరాలోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 6 ఖాళీల్లో ఇప్పటికే నలుగురి పేర్లు ఖరారయ్యాయని, మరో 2 పేర్లు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వేర్వేరు పేర్లు ప్రతిపాదించడంతోనే ఈ రెండు బెర్తులు పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కశ్మీర్, హరియాణా ఎన్నికలు ముగిశాక AICC నేతలతో రేవంత్ చర్చలు జరిపి క్యాబినెట్ జాబితా సిద్ధం చేస్తారని సమాచారం.

News September 25, 2024

ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం

image

AP: ఇటీవల వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నా, నాశనమైనా డూప్లికెట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది.