News May 21, 2024
రిటైర్డ్ HM ఇంట్లో సోదాలు.. ఉగ్రవాదులతో లింక్?

AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు చేపట్టింది. స్థానికంగా నివసించే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. అబ్దుల్ కుమారులు కొంతకాలంగా బెంగళూరులో నివసిస్తున్నారు. కానీ వారు అకస్మాత్తుగా కనిపించకుండాపోయారు. దీంతో వారికి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
Similar News
News September 17, 2025
బుమ్రాకు రెస్ట్?

ఆసియా కప్లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.
News September 17, 2025
BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 17, 2025
చరిత్రాత్మక ఘట్టం.. పార్టీకో పేరు!

TG: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1948, SEP 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చరిత్రాత్మక రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. అటు BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా.. ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే.