News April 14, 2025
రిటైర్డ్ ఔట్.. పాజిటివ్‌గానే తీసుకున్నా: తిలక్

ఇటీవల LSGతో మ్యాచ్‌లో తన <<15997954>>రిటైర్డ్ ఔట్<<>> వివాదంపై తిలక్ వర్మ స్పందించారు. మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు ప్రయోజనం కోసమేనని తెలిపారు. దాన్ని తాను పాజిటివ్‌గానే తీసుకున్నట్లు చెప్పారు. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపినా తాను సిద్ధమేనని, ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కోచ్, స్టాఫ్‌కు చెప్పినట్లు వివరించారు. నిన్న DCపై తిలక్ 59 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 15, 2025
కెరీర్ పట్ల ఎలాంటి రిగ్రెట్ లేదు: భువనేశ్వర్

తన కెరీర్ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా, కృతజ్ఞతతో ఉన్నట్లు చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు గానీ పశ్చాత్తాపం గానీ లేదన్నారు. ఇంతకుమించి తానేమీ కోరుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ స్వింగ్ బౌలర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2022 నవంబర్‌లో ఆడారు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న భువీ IPLలో అత్యధిక వికెట్లు(187) తీసిన పేసర్‌గా ఉన్నారు.
News April 15, 2025
పోలీసింగ్‌లో సౌతిండియా టాప్.. AP, TG ర్యాంకులు ఎంతంటే?

ఫోర్త్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం పోలీసింగ్, జైళ్లు, న్యాయవ్యవస్థ, న్యాయ సహాయంలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఈ విభాగాల్లో కర్ణాటక టాప్ ప్లేస్ దక్కించుకోగా AP, TG, KL, TN టాప్-5లో ఉన్నాయి. బెంగాల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది సర్వేలో TG 11వ స్థానంలో నిలవగా ఈసారి మూడో ప్లేస్‌కి దూసుకొచ్చింది. ఇక గత పదేళ్లలో జైళ్లలోని ఖైదీల సంఖ్య 50శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది.
News April 15, 2025
రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె

AP: రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. 14 వేల మంది సమ్మెలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముందు జాగ్రత్తగా రెగ్యులర్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.