News June 24, 2024
గంభీర్ కండీషన్లలో రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ కూడా?

టీం ఇండియా హెడ్ కోచ్గా వచ్చేందుకు గంభీర్ పలు కండీషన్లు పెట్టినట్లు సమాచారం. అవి.. క్రికెట్ వ్యవహారాల్లో ఎవరి జోక్యాలు, ఒత్తిళ్లు ఉండరాదు. సహాయక సిబ్బంది ఎంపికలో ఇంకెవరి పాత్ర ఉండొద్దు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే జట్టు నుంచి రోహిత్, విరాట్ వంటి సీనియర్లందర్నీ తప్పించాలి. టెస్టుల కోసం ప్రత్యేక జట్టును రెడీ చేయాలి. 2027 ODI వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్నకు అనుమతించాలి.
Similar News
News December 1, 2025
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఆర్వోలకు శిక్షణ

రెండో విడత పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రతి ఆర్ఓ వ్యవహరించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదేశించారు. నామినేషన్ల దాఖలు నుంచి లెక్కింపు వరకు అప్రమతంగా ఉండాలన్నారు.
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.
News December 1, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ, ఉ.గోదావరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది. ఇవాళ 5PM వరకు నెల్లూరు(D) కొడవలూరులో 38.7mm, నెల్లూరులో 36.7mm, తిరుపతి(D) తడలో 33.5MM వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.


