News October 9, 2025
భూములిచ్చిన ఊళ్లలోనే రిటర్నబుల్ ప్లాట్లు: CM చంద్రబాబు

AP: అమరావతి అభివృద్ధితో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాలని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ ఊళ్లో భూములిచ్చిన రైతులకు ఆ ఊళ్లోనే రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో 53వ CRDA అథారిటీ సమావేశంలో మొత్తంగా 18 అంశాలపై చర్చించారు. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి CRDA అథారిటీ ఆమోదం తెలిపింది.
Similar News
News October 9, 2025
సీజేఐపై దాడి.. అడ్వొకేట్ రాకేశ్‌పై FIR నమోదు

సీజేఐ BR గవాయ్‌పై ఈ నెల 6న షూ విసిరి దాడికి పాల్పడిన అడ్వొకేట్ <<17935118>>రాకేశ్ కిషోర్‌పై<<>> బెంగళూరులో జీరో FIR నమోదయింది. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భక్తవత్సల ఫిర్యాదుతో విధానసౌధ పోలీసులు BNS 132, 133 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాకేశ్ శిక్షార్హుడని, వెంటనే చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ కేసును పోలీసులు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పీఎస్‌కు బదిలీ చేశారు.
News October 9, 2025
అందుబాటులోకి తిరుమల క్యాలెండర్లు, డైరీలు

తిరుమల శ్రీవారి భక్తుల కోసం TTD 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. tirumala.org, ttdevasthanams.ap.gov.inలో వీటిని పొందవచ్చని తెలిపింది. అలాగే తిరుమలలో సేల్స్ కౌంటర్, ధ్యాన మందిరం, శ్రీనివాసం, విష్ణు నివాసం, టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్(తిరుచానూరు), విజయవాడ, వైజాగ్, చెన్నై, HYDలోని శ్రీవారి ఆలయాల్లో, ఇతర ప్రాంతాల్లోని TTD కళ్యాణ మండపాల్లోనూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
News October 9, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

TG: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని IMD HYD కేంద్రం వెల్లడించింది. జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.