News September 14, 2024
రేవణ్ణ రాక్షసానందం.. రేప్ చేసేటప్పుడు నవ్వాలని బలవంతం

కర్ణాటకలో JDS మాజీ MP రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మూడో ఛార్జిషీట్ దాఖలు చేసిన SIT పోలీసులు రేవణ్ణ ఎంత కర్కశంగా ప్రవర్తించాడో పేర్కొన్నారు. ‘ఓ బాధిత మహిళను గన్తో బెదిరించి తనకు నచ్చిన దుస్తులు ధరించమని చెప్పేవాడు. అత్యాచార సమయంలో మహిళను నవ్వాలని బలవంతం చేసేవాడు. ఆ వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తూ మూడేళ్ల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు’ అని తెలిపారు.
Similar News
News October 23, 2025
తేనెతో జుట్టుకు పోషణ

తేనె వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తేనె సౌందర్య పరిరక్షణలో, జుట్టు సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. * తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందని చెబుతున్నారు. *తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని తెలిపారు.
News October 23, 2025
డార్లింగ్ సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ‘ఈశ్వర్’ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం దిగ్విజయంగా. ఆయన ఇప్పటివరకూ వర్షం, ఛత్రపతి, పౌర్ణమి, బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి 1&2, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీతో సహా మొత్తం 23 సినిమాల్లో నటించారు. వీటిలో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.
News October 23, 2025
బంగ్లా అదుపులో మత్స్యకారులు.. వెనక్కి తీసుకొస్తామన్న మంత్రి

AP: బంగ్లాదేశ్ నేవీ <<18075524>>అదుపులో<<>> ఉన్న 8 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.