News November 3, 2024
రేవంత్ సర్కార్ ఆడబిడ్డలను మోసం చేసింది: BRS

TG: మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి రేవంత్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ దుయ్యబట్టింది. గతంలో ప్రతి మహిళకు ఇచ్చే దీపావళి కానుక ఇదేనని కాంగ్రెస్ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఇప్పటికీ రేవంత్ హామీ అమలుకు నోచుకోలేదని మండిపడింది. ఆడబిడ్డల ఉసురు రేవంత్‌ను ఊరికే వదిలిపెట్టదని హెచ్చరించింది.
Similar News
News December 9, 2025
25 మంది మృతి.. థాయ్‌లాండ్‌కి పరారైన ఓనర్లు

గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన <<18501326>>అగ్నిప్రమాదం<<>>లో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన తర్వాత క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పరారైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల్లోనే డిసెంబర్ 7న ఇండిగో విమానం 6E 1073లో వారు దేశం విడిచినట్లు వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటర్‌పోల్ సహాయంతో వారి అరెస్ట్‌కు చర్యలు చేపట్టారు.
News December 9, 2025
నువ్వుల సాగు.. విత్తనశుద్ధి, విత్తే పద్ధతి

నేల నుంచి సంక్రమించే తెగుళ్లను నివారించడానికి కిలో విత్తనానికి కార్బండిజం 2.5గ్రా. లేదా మాంకోజెబ్ 3గ్రా. కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడటానికి కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5ml కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తాలి. విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు.
News December 9, 2025
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో 149 పోస్టులకు నోటిఫికేషన్

రాయ్‌పుర్‌లోని <


