News July 9, 2024

ఒక్కో మహిళకు రేవంత్ సర్కార్ రూ.20వేలు బాకీ: కిషన్ రెడ్డి

image

TG: ఎన్నికల్లో మహిళలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటిని విస్మరించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘మహిళలకు ప్రతి నెలా రూ.2,500, కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇవ్వలేదు. విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేయలేదు. రేవంత్ సర్కార్ ఒక్కో మహిళకు ప్రస్తుతం రూ.20వేలు బాకీ ఉంది. వారి తరఫున మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని స్పష్టం చేశారు.

Similar News

News March 26, 2026

కరెంట్ ఛార్జీలపై GOOD NEWS

image

AP: FY27లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, ప్రజలపై ట్రూఅప్ భారమూ వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కమ్‌లకు ₹15,790Cr రెవెన్యూ లోటును తామే భరిస్తామని APERCకి లేఖ రాసింది. దీనివల్ల 1.30Cr గృహ విద్యుత్ వినియోగదారులకు మేలు జరగనుంది. 22L మంది రైతులకు, 22 లక్షల SC, ST, ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత/రాయితీ విద్యుత్ కొనసాగనుంది. 2L మంది వాణిజ్య వినియోగదారులకు యూనిట్ ₹12.25 నుంచి ₹9.95కు తగ్గనుంది.

News March 26, 2026

బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం

image

AP: మార్కాపురం జిల్లాలో ఘోర <<19478496>>బస్సు ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.

News March 26, 2026

TN: ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోందంటే?

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల్లోని పార్టీలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. 234 నియోజకవర్గాలకు గాను సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్(SPA)లో DMK 175, INC 28, DMDK 10, VCK 8, కమ్యూనిస్టులు 5, MDMK 4, MMK, KMDK రెండేసి స్థానాల్లో బరిలో నిలిచాయి. ఇక NDAలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27, PMK 18, AMMK 11, TMC 5, IJK 2, TMMK, పురట్చి భారతం పార్టీలు చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి.
<<-se>>#ELECTIONS2026<<>>