News February 27, 2025
రేవంత్ సీఎం కావటం ప్రజల దురదృష్టం: కిషన్ రెడ్డి

TG: మెట్రో విస్తరణ తాను అడ్డుకున్నట్లు నిరూపించే దమ్ముందా అని సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ విస్తరణకు రాష్ట్రం వద్ద నయాపైసా లేక తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలు కేంద్రాన్ని అడిగి ఇచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ సీఎం కావటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గాలిమాటలకు, బ్లాక్‌మెయిలింగ్‌కు తాను భయపడనని స్పష్టం చేశారు.
Similar News
News February 27, 2025
షాకింగ్.. కొడుకుకు 18 ఏళ్లు నిండొద్దని చంపేసింది

USలో మిచిగాన్‌లో దారుణ ఘటన జరిగింది. కేటీ లీ అనే మహిళ కొడుకు ఆస్టిన్(17)ను బర్త్ డే రోజునే చంపేసింది. తనకు 18 ఏళ్లు నిండొద్దని ఆస్టిన్ కోరుకున్నాడని, ఆ మేరకు తల్లి చంపేసిందని కోర్టు విచారణలో పోలీసులు వెల్లడించారు. అయితే తామిద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక గొంతు కోసినట్లు ఆమె తొలుత 911కు కాల్ చేసి చెప్పడం గమనార్హం. ఆమె మానసిక స్థితి సరిగా లేనట్లు సమాచారం.
News February 27, 2025
Perplexity AIతో పేటీఎం జట్టు

తమ యాప్‌లో AI పవర్డ్ సెర్చ్ ఆప్షన్ అందించేందుకు Perplexityతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని Paytm CEO విజయ్ శేఖర్ అన్నారు. యూజర్లు ఆర్థిక నిర్ణయాలు తీసుకొనేందుకు, స్థానిక భాషల్లో రోజువారీ ప్రశ్నలు అడిగేందుకు దీంతో వీలవుతుందన్నారు. ‘నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రజలు సమాచారం పొందుతున్న తీరును AI మార్చేసింద’ని ఆయన తెలిపారు. Perplexityని స్థాపించింది IITM గ్రాడ్యుయేట్ అరవింద్ శ్రీనివాస్ కావడం విశేషం.
News February 27, 2025
సత్యవర్ధన్‌కు నార్కో టెస్టులు చేయండి: వంశీ

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయనను SC, ST కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనన్నారు. కస్టడీలో పోలీసులు తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని తెలిపారు.