News December 6, 2024
ఏం సాధించారని రేవంత్ సంబరాలు: ఈటల

TG: ఏం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని BJP MP ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ‘హోదా మరిచి రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు రేవంత్ రెడ్డి దుర్మార్గాలపై నిర్వహిస్తున్న సభకు జేపీ నడ్డా వస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు డ్రామా ఆడుతున్నాయి. ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారో బయటపెట్టాలి. రేపటి ఆటో డ్రైవర్ల సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోంది’ అని ఈటల అన్నారు.
Similar News
News October 18, 2025
‘వృక్షరాణి’ తులసి తిమ్మక్క గురించి తెలుసా?

మనకెంతో ఇచ్చిన ప్రకృతిని కాపాడేందుకు ఒక్క మొక్కనైనా నాటలేకపోతున్నాం. కానీ కర్ణాటకకు చెందిన 113ఏళ్ల తులసి తిమ్మక్క తన జీవితాన్నే మొక్కలు నాటేందుకు త్యాగం చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత 80 ఏళ్లలో ఈ ‘వృక్షరాణి’ 8,000 కంటే ఎక్కువ మొక్కలు నాటి బీడు భూములను పచ్చగా మార్చారు. పిల్లలు లేని లోటును తీర్చుకునేందుకు ఆమె చెట్లను దత్తత తీసుకున్నారు. ఆమెను కేంద్రం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
News October 18, 2025
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్ను సవరిస్తూ <
News October 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 39 సమాధానాలు

1. క్షీరసాగర మథనం సమయంలో అమృతంతో ఉద్భవించిన దేవతల వైద్యుడు ధన్వంతరి.
2. జమదగ్ని మహర్షి కుమారుడిగా పుట్టిన విష్ణు అవతారం ‘పరుశరాముడు’.
3. కాలానికి, వినాశనానికి దేవతగా కాళీ మాతను పరిగణిస్తారు.
4. క్షీరసాగర సమయంలో మొదట కాలకూట విషం వచ్చింది.
5. ఇంద్రుడి రాజధాని ‘అమరావతి’. <<-se>>#Ithihasaluquiz<<>>