News March 16, 2025

KCRను చర్చకు రమ్మను.. హరీశ్ రావుకు రేవంత్ సవాల్

image

TG: తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు హరీశ్ రావుకు లేవని CM రేవంత్ విమర్శించారు. నాగార్జున సాగర్, SRSP వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు. జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే నేడు TGకి నీటిని అందిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులపై పిల్లకాకులు కాకుండా అసలైన వ్యక్తి(KCR)ని చర్చకు రమ్మనాలని హరీశ్‌కు సవాల్ చేశారు.

Similar News

News December 24, 2025

విత్తనాలు కొనేటప్పుడు రశీదు కీలకం

image

విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు మరియు డీలర్ సంతకం తప్పకుండా ఉండాలి. పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. అందుకే ఆ రశీదును పంటకాలం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉంచాలి. పూత, కాత రాకపోతే నష్టపరిహారానికి రశీదు అవసరం.

News December 24, 2025

ఫిట్‌నెస్‌ ఫీజుల పెంపునకు బ్రేక్

image

AP: రవాణా లారీలకు ఫిట్‌నెస్‌ ఫీజుల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌తో 15 ఏళ్లు దాటిన లారీలకు రూ.36 వేల వరకు భారం పడుతోంది. దీంతో లారీ యజమానులు వాహనాలు నిలిపివేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం <<18515219>>చర్చలు జరిపి<<>> వారికి హామీ ఇచ్చింది. తాజాగా పెంపు నిర్ణయాన్ని నిలిపివేసింది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

News December 24, 2025

బ్యారేజీల రిపేర్లకు ఏజెన్సీలు నో?.. మంత్రి ఆగ్రహం!

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు రిపేర్లు చేయబోమని ఏజెన్సీలు ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు వార్తలొస్తున్నాయి. బ్యారేజీలు డ్యామేజ్ అయ్యే నాటికే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిపోయిందని ఏజెన్సీలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహించారని సమాచారం. పనులెలా చేయించుకోవాలో తమకు తెలుసని, చట్టపరంగా సమాధానమిస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.