News August 22, 2024
రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారు: కేటీఆర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724312420689-normal-WIFI.webp)
TG: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. రుణమాఫీపై ప్రభుత్వం కోతలతో రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. చేవెళ్లలో BRS నేతల ధర్నాలో ఆయన మాట్లాడారు. హామీల అమలు గురించి అడిగితే నిండు సభలో సబితను అవమానించారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఓట్లు వేసి అమలు చేయకుండా రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారన్నారు.
Similar News
News February 13, 2025
మోహన్ బాబుకు ముందస్తు బెయిల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425732093_367-normal-WIFI.webp)
జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
News February 13, 2025
SnapChatలో రికార్డు సృష్టించారు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739421580938_746-normal-WIFI.webp)
మీరెప్పుడైనా స్నాప్‌చాట్ వాడారా? అందులో ఇద్దరు స్నేహితులు కలిసి స్నాప్ పంపించుకుంటే స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది. రోజూ ఒక స్నాప్ (ఫొటో/వీడియో) పంపిస్తుంటే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఇలా కాటీ &ఎరిన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ 3662+ స్ట్రీక్‌తో రికార్డు సృష్టించారు. అంటే వీరి స్నాప్ జర్నీ పదేళ్లు దాటిందన్న మాట. వీరి తర్వాత లెస్లీ & జయ్నబ్ (3536+), ఎర్మిరా & జవి (3528+) ఉన్నారు. మీ హైయెస్ట్ స్ట్రీక్స్ ఎంత?
News February 13, 2025
బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి.. బండి డిమాండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735672916360_1045-normal-WIFI.webp)
TG: రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, MLC ఎన్నికల్లో INC మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల ఆధారంగా రిజర్వేషన్లకు BJP వ్యతిరేకమని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల వ్యవహారాన్ని INC ప్రభుత్వం కేంద్రంపై నెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు.