News May 2, 2024
రిజర్వేషన్లపై రేవంత్ తప్పుడు ప్రచారం: బండి

TG: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ సీటుకు కాంగ్రెస్ నేతలు ఎసరు పెట్టారన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 14 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. దీంతో రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్లపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Similar News
News February 1, 2026
NDDB రిపోర్టు వచ్చాకే జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పా: చంద్రబాబు

AP: కల్తీ నెయ్యి ఘటనపై NDDB రిపోర్టు వచ్చాకే తాను మాట్లాడానని సీఎం చంద్రబాబు చెప్పారు. అందులో జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పానన్నారు. దీనిపై వైసీపీ నేతలు నానాయాగి చేసి సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని హెచ్చరించారు.
News February 1, 2026
ట్యాక్స్ మిస్టేక్స్.. శిక్షల నుంచి రిలీఫ్!

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు కొన్ని విషయాల్లో ఊరట కల్పించారు. అప్పీల్‌కు ముందు కట్టాల్సిన ప్రీపేమెంట్‌ను 20% నుంచి 10%కి తగ్గించారు. రీఅసెస్‌మెంట్ మొదలైనా 10% అదనపు పన్నుతో రిటర్న్స్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ₹20 లక్షల లోపు విదేశీ ఆస్తులను వెల్లడించకపోయినా జైలు శిక్ష ఉండదు. అసెస్‌మెంట్, పెనాల్టీలకు ఒకే ఆర్డర్ వస్తుంది. తప్పుగా రిపోర్ట్ చేసినా 100% అదనపు ట్యాక్స్ కడితే శిక్షలు ఉండవు.
News February 1, 2026
దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేలా బడ్జెట్: CBN

AP: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా ఎదిగేందుకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ఎంతో దోహదపడుతుందని CM CBN అభిప్రాయపడ్డారు. ‘ప్రజలు కోరుకొనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీని ఇది రిఫ్లెక్ట్ చేస్తోంది. రైతులు మహిళలు, యువతకు ప్రాధాన్యమిచ్చారు. మాన్యుఫ్యాక్చరింగ్, MSMEలకు అధిక ప్రోత్సాహకాలున్నాయి. హైస్పీడ్ రైళ్లు, రేర్ ఎర్త్ కారిడార్ల వల్ల APకి మేలు. బడ్జెట్‌ను తెచ్చిన PMకు అభినందనలు’ అని పేర్కొన్నారు.


