News September 24, 2024

అమృత్ టెండర్లతో రేవంత్‌కు సంబంధం లేదు: BRS మాజీ ఎమ్మెల్యే

image

TG: అమృత్ టెండర్లపై అనవసరంగా వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డికి టెండర్లకు ఎలాంటి లింక్ లేదు. నా అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్‌కు సొంత బావమరిది కాదు. సృజన్‌కు రాజకీయాలతో సంబంధం లేదు. కేటీఆర్‌కు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. త్వరలో ఆయన్ను కలిసి దీనిపై మాట్లాడతా. నేను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా’ అని తెలిపారు.

Similar News

News November 26, 2025

2033 నాటికి 150 లక్షల టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం

image

AP: పాల ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 2033 నాటికి తొలి 3 స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 139.46 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోందని.. 2033 నాటికి దీన్ని 150 లక్షల టన్నులకు పెంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.

News November 26, 2025

దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి: రాష్ట్రపతి

image

భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రాజ్యాంగమే మార్గదర్శి. 25Cr మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అతిపెద్ద ఘనత. ఆర్థిక ఏకీకరణలో భాగంగా GST తీసుకొచ్చాం. మహిళా సాధికారిత కోసం ట్రిపుల్ తలాక్ తీసేశాం. Art370ని రద్దు చేశాం’ అని చెప్పారు.

News November 26, 2025

సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.