News February 4, 2025

కులగణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్

image

TG: కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే చేశామన్నారు. 50 రోజుల పాటు సర్వే చేశామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ సర్వే నిర్వహించామని వెల్లడించారు.

Similar News

News December 2, 2025

రాష్ట్రంలో శామీర్‌పేట్ PSకు ఫస్ట్ ప్లేస్

image

TG: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో మేడ్చల్(D) శామీర్‌పేట్ PS 7వ స్థానం, రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్‌ సాధించింది. PS పని తీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో వ్యవహరించే తీరు తదితర అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలూ పరిశీలించింది. ఏటా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను MHA ఎంపిక చేస్తుంది.

News December 2, 2025

నేడు, రేపు, ఎల్లుండి.. నాన్ వెజ్ వద్దు: పండితులు

image

నేటి నుంచి వరుసగా మూడ్రోజుల పాటు మద్యమాంసాలు మానుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ‘నేడు శివపార్వతుల ఆరాధనకు పవిత్రమైన ప్రదోషం ఉంది. రేపు సకల కార్యసిద్ధిని కలిగించే హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఎల్లుండి పౌర్ణమి తిథి. దత్త జయంతి పర్వదినం. ఈ 3 రోజులు పూజలు, వ్రతాలకు విశిష్టమైనవి. కాబట్టి ఈ శుభ దినాలలో మద్యమాంసాలను మానేస్తే.. ఆయా వ్రతాల అనుగ్రహాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు’ అని అంటున్నారు.

News December 2, 2025

తిరుమల తరహాలో అన్ని చోట్లా..: సింఘాల్

image

AP: తిరుమల తరహాలో TTD పరిధిలోని ఆలయాల్లో రుచికరంగా అన్నప్రసాదాలు అందజేస్తామని TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. TTDలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలోని వేంకటేశ్వరుడి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.