News February 15, 2025

ఎస్సీ వర్గీకరణ సభకు రావాలని రాహుల్‌కు రేవంత్ ఆహ్వానం!

image

TG: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. మెదక్‌లోని గద్వాల్‌లో నిర్వహించనున్న ఎస్సీ వర్గీకరణ సభతో పాటు సూర్యాపేటలో జరిగే కులగణన సభకు రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో స్థానిక సంస్థల సమాయత్తం, పాలనాపరమైన అంశాలు, మంత్రివర్గ విస్తరణ ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Similar News

News November 11, 2025

ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు.. సమయస్ఫూర్తి!

image

ఢిల్లీలో పేలుడును ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దేశంలో 2వారాలుగా ఉగ్ర అనుమానితుల అరెస్టులు చూస్తే ఓ రకంగా అప్రమత్తమైన నిఘాతోనే దుర్ఘటన తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ఫరీదాబాద్‌లో JK పోలీసులు నిన్న భారీ పేలుడు పదార్థాలతో ముగ్గురిని పట్టుకున్నారు. దీంతో ఆ టీమ్‌కు చెందిన డా.ఉమర్ తన వద్ద గల మెటీరియల్‌తో బ్లాస్ట్ చేశాడు. నిఘా నిద్రపోతే అంతా కలిసి భారీ నరమేథం సృష్టించేవారేమో!

News November 11, 2025

నీకు మరింత శక్తి చేకూరాలి సంజూ: CSK

image

ఇవాళ సంజూ శాంసన్ పుట్టినరోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ అతడికి స్పెషల్ విషెస్ తెలిపింది. ‘నీకు మరింత శక్తి చేకూరాలి సంజూ. విషింగ్ యూ సూపర్ బర్త్‌డే’ అంటూ అతడి ఫొటోను Xలో షేర్ చేసింది. IPLలో శాంసన్‌ను CSK తీసుకోనుందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. దీంతో సంజూ చెన్నైకి రావడం కన్ఫర్మ్ అయిందంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News November 11, 2025

మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్టు హొమి వైర్‌వాలా

image

భారత్‌లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు హొమి వైర్‌వాలా. 1930ల్లో కెరీర్‌ ప్రారంభించిన హొమి తాను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్‌ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ ప్రకటించింది.