News May 3, 2024

రేవంత్‌ ఒక రియల్ ఎస్టేట్ సీఎం: అర్వింద్

image

TG: సీఎం రేవంత్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ ఒక రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అని, ఆయనకు కమీషన్లపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని ఆరోపించారు. పథకాల పేర్లు వింటే లక్షాధికారులైనట్లే ఉంటుంది కానీ.. ఆ పథకాలు అమలు కావని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు ఆరు గాడిద గుడ్లలా మిగిలిపోయాయని, కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని అర్వింద్ దుయ్యబట్టారు.

Similar News

News March 11, 2026

యూజర్లకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్?

image

మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇది ఆదాయం పెంచడంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆలోచిస్తుందట. ఒక GB డేటాపై ₹1 ట్యాక్స్ వేసినా ఏటా ₹22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News March 11, 2026

రాష్ట్రంలో మూడో డిస్కం

image

TG: రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటైంది. దీనికి తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TGRPDCL)గా పేరు పెడుతూ ప్రభుత్వం GO జారీ చేసింది. CMDగా ముషారఫ్ అలీ ఫరూఖీని, మరో నలుగురు డైరెక్టర్లను నియమించింది. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, వాటర్ సప్లై స్కీమ్/మిషన్ భగీరథ, HMWSSB, మున్సిపల్ వాటర్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. కొత్త వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వనుంది.

News March 11, 2026

రైల్వేపై LPG ప్రభావం.. ఫుడ్ డెలివరీలో అంతరాయం!

image

భారత్‌లో LPG కొరత రైల్వే వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. రైళ్లలో భోజన సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసినవారికే ప్రయారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అటు ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారాలని స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్, జన్ ఆహార్ అవుట్‌లెట్లకు IRCTC లేఖ రాసింది. ఈ సంస్థ రోజుకు 17 లక్షల భోజనాలు డెలివరీ చేస్తోంది.