News October 5, 2024
రేవంత్ CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు: KTR

TG: రేవంత్రెడ్డి CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సీఎం మనుషులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.
Similar News
News January 21, 2026
మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోతే?

మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోయినా, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా నీటితో స్నానం వీలుపడకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన పురాణాలు ఇందుకు మంత్ర, వాయువ్య, ఆగ్నేయ, కాపిల, ఆతప, మానస వంటి ప్రత్యామ్నాయ స్నాన పద్ధతులను సూచించాయి. మహావిష్ణువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ చేసే ‘మానస స్నానం’ అన్నింటికంటే ఉత్తమమైనది. భక్తితో భగవంతుడిని స్మరిస్తే మనసు శుద్ధి అవుతుంది. ఇలా భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు.
News January 21, 2026
NPCILలో 114 పోస్టులు.. అప్లై చేశారా?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)లో 114 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, BSc, టెన్త్+ITI, ఇంటర్(MPC), ఇంటర్+మెడికల్ రేడియోగ్రఫీ/X-Ray టెక్నికల్ ట్రేడ్ సర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అర్హతగల వారు FEB 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.npcilcareers.co.in
News January 21, 2026
గొర్రెల్లో బొబ్బ రోగం.. ఎలాంటి చికిత్స అందించాలి?

☛ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
☛ ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
☛ బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
☛ వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.


