News November 16, 2024
రామ్మూర్తి నాయుడు మృతిపై రేవంత్ దిగ్భ్రాంతి

TG: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి మరణంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అలాగే వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు ఏపీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, సవిత కూడా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News December 17, 2025
INDvsSA.. 4వ T20 రద్దు?

IND-SA మధ్య 4వ T20 రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. 6.30PMకు టాస్ వేసే సమయంలోనే పొగమంచు కురుస్తుండడంతో విజిబిలిటీ లేదని మ్యాచ్‌ను అంపైర్లు పోస్ట్‌పోన్ చేశారు. రాత్రి కావడంతో పొగమంచు తీవ్రమవుతుంది. ప్లేయర్లు అనారోగ్యం బారినపడే ఛాన్స్ ఉండటంతో మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సుంది. 9pmకు మరోసారి అంపైర్లు పరిశీలించిన తర్వాత క్లారిటీ రానుంది.
News December 17, 2025
రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు: చంద్రబాబు

AP: రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ కీలకమని, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
News December 17, 2025
వారసత్వంగా వచ్చిన ఇంటికి వాస్తు పాటించాలా?

వారసత్వంగా వచ్చిన ఇంటికీ వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. తద్వారా శుభ ఫలితాలు కొనసాగుతాయంటున్నారు. ‘మీ పేరు బలం, జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా ఇంటి సింహద్వారం, ఇతర చిన్నపాటి మార్పులు చేసుకోవడం మంచిది. తద్వారా వారసత్వంగా వచ్చిన సుఖసంతోషాలు, సిరిసంపదలు అనుభవించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లేదంటే, పరిస్థితులు మారి కష్టాలు రావచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


