News February 5, 2025
రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ

TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 3, 2025
GNT: రేట్లు రికార్డులు.. కార్మికుల గృహాల్లో ఆకలి బ్రేకులు

ఉమ్మడి గుంటూరు జిల్లా బంగారం, వెండి తయారీలో ప్రాముఖ్యత పొందింది. పెరిగిన బంగారం ధరలు కార్మికుల జీవనాన్ని దెబ్బతీశాయి.
దీంతో ప్రజలు కొనుగోళ్లు తగ్గించటంతో ఆర్డర్లు లేక షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దినసరి కూలీపై ఆధారపడే వర్కర్లు పనులు లేక కుటుంబపోషణకు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ స్థిరపడకపోతే చిన్న షాపులు మూతపడే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి.
News December 3, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమ్ ఇండియా ప్లేయర్ మోహిత్ శర్మ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. 2015లో చివరిసారి అతడు భారత జట్టు తరఫున ఆడారు. మీడియం పేసర్ అయిన ఈ 37 ఏళ్ల బౌలర్ 26 వన్డేల్లో 31 వికెట్లు, 8 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టారు. IPLలో మోహిత్ CSK, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.