News April 10, 2024
BRS ఎమ్మెల్యేలతో రేవంత్ సొంత దుకాణం: మహేశ్వర్ రెడ్డి
TG: రాష్ట్రంలో త్వరలోనే రామరాజ్యం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చుకుంటారని.. త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగడం కంటే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రేవంత్ సొంత దుకాణం పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు రేవంత్ దూరమవ్వాలనుకుంటే ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
Similar News
News November 15, 2024
వారానికి 5 రోజుల పని మంచిది కాదు: నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి హార్డ్ వర్క్‌పై మరోసారి కామెంట్లు చేశారు. తాను రోజులో 14గంటలు కష్టపడేవాడినని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇండియాలో 5రోజుల పని దినాల విధానం మంచిది కాదన్నారు. హార్డ్ వర్క్‌కు ప్రత్యామ్నాయం లేదని, మీరు అత్యంత తెలివైన వ్యక్తి అయినా కష్టపడాల్సిందేనని చెప్పారు. PM మోదీ వారానికి 100గంటలు పని చేస్తారని దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
News November 15, 2024
ఫైల్స్ దగ్ధం.. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌పై అభియోగాలు
AP: మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 22ఎ అసైన్డ్ భూములపై కొందరు అక్రమంగా హక్కులు సాధించారని, ఆ ఆధారాలు ఉండొద్దనే రికార్డులు తగలబెట్టారని CID ప్రాథమిక నివేదికలో పేర్కొంది. దీనికి ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్‌ను బాధ్యులుగా గుర్తించిన ప్రభుత్వం వారిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులిచ్చారు.
News November 15, 2024
వయనాడ్ విషాదం జాతీయ విపత్తు కాదు: కేంద్రం
అధికారికంగా 231 మంది చనిపోయిన వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా పరిగణించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇది సాధ్యం కాదని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. కేరళ ప్రభుత్వం రూ.900 కోట్ల సాయం కోరగా, ఆ రాష్ట్రానికి కేటాయించిన రూ.388 కోట్లలో 291 కోట్లను రెండు విడతలుగా ఇచ్చినట్లు వెల్లడించారు. పైగా ఆ రాష్ట్ర SDRF ఖాతాలో తగినంత నిధులు (రూ.395 కోట్లు) ఉన్నాయన్నారు.