News April 22, 2025
రాహుల్ లెటర్‌పై స్పందించిన రేవంత్

TG: రాష్ట్రంలో వేముల రోహిత్ యాక్ట్ తీసుకురావాలన్న కాంగ్రెస్ అగ్రనేత<<16168187>> రాహుల్ గాంధీ<<>> విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హిరోషిమాలో రాహుల్ లేఖను చదివినట్లు పేర్కొన్నారు. చట్టం తీసుకురావాలని కోరడం స్ఫూర్తిదాయకమైన పిలుపు అన్నారు. ఆయన ఆలోచనలు, భావాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
Similar News
News August 6, 2025
మోదీని గద్దె దించుతాం: రేవంత్

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ప్రధాని మోదీని గద్దె దించుతామని CM రేవంత్ హెచ్చరించారు. BC రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. తాము కేంద్రానికి పంపిన 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. BC రిజర్వేషన్లు సాధించి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు.
News August 6, 2025
ప్రకటనలు, సంక్షేమ పథకాల్లో CM ఫొటో ఉండొచ్చు: సుప్రీం తీర్పు

సంక్షేమ పథకాల్లో CMల పేర్లు, ఫొటోలు వాడొద్దన్న మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. CM ఫొటో వాడుకోవచ్చని CJI జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సంక్షేమ పథకాలకు CM పేరు, ఫొటోలు వాడటంపై AIDMK హైకోర్టును ఆశ్రయించగా వాడొద్దని తీర్పు వచ్చింది. దీనిని TN GOVT SCలో సవాల్ చేయడంతో పైవిధంగా తీర్పు ఇచ్చింది. రాజకీయాల కోసం కోర్టును వాడుకోవద్దని AIDMK నేతకు రూ.10లక్షల ఫైన్ వేసింది.
News August 6, 2025
యూపీఐ ఎప్పటికీ ఉచితమని చెప్పలేదు: RBI గవర్నర్

యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. ‘యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదు. ఇప్పటికీ సబ్సిడీల రూపంలో ప్రభుత్వమే వాటిని భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వ పాలసీ’ అని పేర్కొన్నారు.