News August 21, 2024
రుణమాఫీపై దృష్టి మరల్చేందుకే రేవంత్ చిల్లర భాష: కేటీఆర్

TG: సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని అందుకు నిరసనగా రేపు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తామని కేటీఆర్ అన్నారు. ‘రుణమాఫీపై దృష్టిని మరల్చేందుకు రేవంత్ చిల్లర భాష ఉపయోగిస్తున్నారు. KCRను తిడితే కొన్ని మీడియా సంస్థలు సంతోష పడుతున్నాయి. కానీ మేం డైవర్ట్ కాము. రైతుల పక్షానే పోరాడతాం. ఆంక్షలు లేకుండా ఎప్పటివరకు రుణమాఫీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News April 1, 2026
‘అతిరథ మహారథులు’ అంటే ఎవరు?

ఏదైనా రంగంలో సమర్థులు, శక్తిమంతుల గురించి చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఇది పురాణాల నుంచి వచ్చింది. యుద్ధ నైపుణ్యాలను బట్టి వీరులకు 5 స్థాయులుంటాయి. రథి అంటే ఒకేసారి 5వేల మందితో యుద్ధం చేసేవాడు. అతిరథి అంటే రథికి 12 రెట్లు, మహారథి అంటే 12 అతిరథులతో సమానం. అతి మహారథి అంటే 12 మహారథుల శక్తి గలవాడు. మహామహారథి అంటే మహారథికి 24 రెట్లు. వీరందరినీ కలిపి అతిరథ మహారథులుగా పిలిచేవారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 1, 2026
‘హార్ముజ్’ ఓపెన్ చేయాల్సిందే.. యుద్ధంలోకి యూఏఈ, సౌదీ!

ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు UAE, సౌదీ నిర్ణయించుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ఆ 2 దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో దాన్ని ఓపెన్ చేసేలా అమెరికాతో చేతులు కలిపేందుకు UAE ఓకే చెప్పినట్లు రాసుకొచ్చింది. ఇరాన్‌పై దాడులకు మద్దతు కోసం ప్రపంచదేశాలతో రహస్యంగా చర్చించినట్లు పేర్కొంది. తమ వైమానిక స్థావరాలను US వాడుకొనేందుకు సౌదీ అంగీకరించినట్లు తెలిపింది.
News April 1, 2026
FY26లో ₹22.27 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

దేశంలో మార్చి నెలకుగాను 8.8% వృద్ధితో ₹2 లక్షల కోట్ల మేర GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. దేశీయ విక్రయాల ద్వారా ₹1.46 లక్షల కోట్లు, దిగుమతుల రూపంలో ₹53,861 కోట్లు వచ్చినట్లు తెలిపింది. రిఫండ్ల అనంతరం నికరంగా ₹1.78 లక్షల కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ₹22.27 లక్షల కోట్లు వచ్చినట్లు వివరించింది. FY25(₹20 లక్షల కోట్లు)తో పోలిస్తే 8.3% వృద్ధి నమోదైనట్లు ప్రకటించింది.


