News April 3, 2025
మరో దోపిడీకి తెరలేపిన రేవంత్ సర్కార్: KTR

TG: కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తుకాగితంతో సమానమని సీఎం రేవంత్ మరోసారి నిరూపించారని KTR దుయ్యబట్టారు. ఉచిత LRS అని మభ్యపెట్టి అధికారంలోకి రాగానే రూ.1,400 కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఖజానా నింపుకునేందుకు గడుపు పెంచి మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. హామీని మరచి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న CONG సర్కారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 6, 2025
టాస్ గెలిచిన భారత్

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.
భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
News December 6, 2025
4,116 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.rrcnr.org
News December 6, 2025
శబరిమల యాత్రలో మార్గదర్శి ‘గురుస్వామి’

శబరిమల యాత్రకు సిద్ధమయ్యే భక్తులకు సమగ్రమైన మార్గదర్శకత్వం అందించే వ్యక్తే ‘గురుస్వామి’. ఆయన శబరిమల యాత్రకు సంబంధించిన వివరాలు, సంప్రదాయాలు, విశిష్టతలను భక్తులకు నేర్పిస్తారు. జ్ఞానం, పరివర్తన, స్వీయ-సాక్షాత్కారం కోసం దీక్ష తీసుకునే వారికి గురువు అవసరం ఉంటుంది. కఠినమైన శబరిమల యాత్రలో, ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి, ప్రతి భక్తుడు తప్పకుండా ఓ గురుస్వామిని ఎంచుకుంటారు. <<-se>>#AyyappaMala<<>>


