News July 27, 2024
రేవంత్ సవాల్.. సరికాదన్న హరీశ్ రావు

TG: అసెంబ్లీలో హరీశ్ రావు, కాంగ్రెస్ నేతల మధ్య చర్చ వాడివేడిగా కొనసాగుతోంది. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్లలో అవకతవకలపై విచారణకు సిద్ధమా? అని బీఆర్ఎస్ నేతలను సీఎం ప్రశ్నించారు. బతుకమ్మ చీరలు నాసిరకం అన్న సీఎం వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు.
Similar News
News November 23, 2025
NZB: పల్లెల్లో టెన్షన్ టెన్షన్.. రిజర్వేషన్లు మారితే..!

గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. మళ్లీ పల్లెల్లో సందడి, టెన్షన్ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కలతో సర్పంచి స్థానాలకు ఆర్డీవోలు, కులగణనతో వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా BC, SC, STలకు కేటాయిస్తారు. ఆపై మహిళలకు 50 శాతం స్థానాలు లక్కీ డ్రా తీస్తారు. రిజర్వేషన్లు మారితే లీడర్లు తమ భార్యలు, తల్లులను బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు.
News November 23, 2025
మూవీ అప్డేట్స్

✹ ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో రానున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమంతో మొదలు.. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి
✹ ఇవాళ సాయంత్రం 6.11గంటలకు ‘రాజాసాబ్’ నుంచి రిలీజ్ కానున్న ‘రెబల్ సాబ్’ సాంగ్.. మరో పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
✹ శివ నిర్వాణ, రవితేజ కాంబినేషన్లో రానున్న కొత్త మూవీ షూటింగ్ రేపటి నుంచి మొదలు!
✹ ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం తెలుగులో ‘అమరకావ్యం’గా విడుదల కానుంది
News November 23, 2025
రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్కు పాలనాధికారం ఉంది.


