News March 12, 2025

రేవంత్‌ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి: కేటీఆర్

image

TG: ప్రతిపక్షాల మరణం కోరుకోవటం సీఎం రేవంత్ నీచబుద్ధికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయనను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుపక్కల వారికి ప్రమాదమని కుటుంబ సభ్యులకు సూచించారు. చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎంకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

Similar News

News October 15, 2025

అడ్డగోలు NOCలు.. 55 మంది ఇంజినీర్లపై వేటు

image

HYD పరిధిలో చెరువులు, కుంటలు, కాల్వల పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ NOCలు జారీ చేసిన ఇంజినీర్ల(SE, EE, AEE, DEE) భరతం పట్టింది నీటిపారుదల శాఖ. పైరవీలు, పలుకుబడితో ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన 55 మందిని ఇతర జిల్లాలకు పంపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉండటంతో వర్కింగ్ అరేంజ్‌మెంట్ పేరుతో ఇతర జిల్లాలకు పంపింది. వారి స్థానాల్లో ఇతర జిల్లాల వారిని ODపై తీసుకొచ్చింది.

News October 15, 2025

EPFO ఖాతాదారులకు అలర్ట్

image

PF అకౌంట్ ఉన్న వారు ఎక్కువకాలం ఉపాధి లేకుండా కొనసాగిన సందర్భాల్లోనే పూర్తిగా నగదు ఉపసంహరణ చేసుకునేలా EPFO సెంట్రల్ బోర్డు అనుమతిచ్చింది. ఏడాదిగా ఉద్యోగం లేని వారు EPF తుది పరిష్కారానికి, 3 ఏళ్లు ఉపాధి లేని వారు PF డబ్బుతో పాటు పెన్షన్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం 2 నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న వారు ఖాతాల్లోని నిధులను పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో EPFO ఈ నిర్ణయం తీసుకుంది.

News October 15, 2025

గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత

image

గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. ఇంట్లో నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ 3PMకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాయక్ మృతి పట్ల పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు జీవితం అంకితం చేశారని కొనియాడారు.