News March 9, 2025
రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్ రావు

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో CM రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు మహిళా సంఘాలకు రూ.75 చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం రూ.50 చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే, BRS రూ.50 ఇస్తే, రూ.25 ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. CM మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు.
Similar News
News March 30, 2026
ఎమ్మెల్యేలకు సన్నబియ్యంతో లంచ్

TG: ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ నివేదికను వెల్లడించనుంది. ఇవాళ్టితో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండగా.. 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర లెక్కలపై కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనుంది. అటు PDS సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ బియ్యంతోనే లంచ్ ఏర్పాటు చేయనున్నారు.
News March 30, 2026
ప్రకాశ్‌రాజ్ తల్లి కన్నుమూత

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత(86) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన ఇంట్లోనే ఆమె తుదిశ్వాస విడిచారు. సాయంత్రం సువర్ణలత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
News March 30, 2026
AP హైకోర్టులో 300 పోస్టులు.. నేటి నుంచి అప్లై చేసుకోవచ్చు

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాల కోసం https://aphc.gov.in/ చూడండి.


