News September 6, 2024

TPCC ప్రెసిడెంట్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన రేవంత్

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మహేశ్ కుమార్‌ గౌడ్‌కు అప్పగిస్తున్నట్లు CM రేవంత్ ప్రకటించారు. 2021 జులై 7న TPCC అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనపై పూర్తి విశ్వాసం ఉంచిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు థాంక్స్ చెప్పారు.

Similar News

News December 10, 2025

ఉప్పల్‌లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

image

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News December 10, 2025

అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.

News December 10, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 5 సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు 15ఏళ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.30,000-రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/