News November 8, 2024
REVANTH: స్టూడెంట్ లీడర్ టు సీఎం..

TG: ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన సీఎం రేవంత్ పాఠశాల రోజుల్లోనే లీడర్ అయ్యారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి 2006లో జెడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ పార్టీ విభాగానికి అధ్యక్షుడయ్యారు. అనంతరం కాంగ్రెస్లో చేరి టీపీసీీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. శపథం చేసి మరీ కేసీఆర్ను గద్దె దించి తాను CM అయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.
Similar News
News October 29, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, ఫైనాన్స్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST,దివ్యాంగులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్సైట్: https://bankofbaroda.bank.in/
News October 29, 2025
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా?

మన ఇంట్లో వస్తువుల అమరిక మనపై శుభాశుభ ఫలితాలను చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే.. వాడని, తుప్పు పట్టిన, ఆగిపోయిన గడియారం వంటి వస్తువులను వెంటనే తీసివేయాలని అంటున్నారు. ‘కిటికీలు, తలుపులపై సెలనైట్ రాళ్లు ఉంచడం శుభం. గ్యాస్ స్టవ్ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఆర్థిక సమస్యలు రావొచ్చు. రోజూ అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది’ అంటున్నారు.
News October 29, 2025
పంట దిగుబడిని పెంచే పచ్చి ఆకు ఎరువు అంటే ఏమిటి?

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.


