News October 21, 2024
రేవంత్.. తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు: హరీశ్ రావు

TG: గ్రూప్-1 విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై కఠినంగా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని హరీశ్ రావు మండిపడ్డారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతకు మొండిచేయి చూపించారని విమర్శించారు. పదేళ్లలో BRS ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదమని, తాము 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
Similar News
News October 23, 2025
రాజధానిలో 12 బ్యాంకులకు 28న శంకుస్థాపన

AP: అమరావతిలో 12 ప్రముఖ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాల్గొననున్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. SBI, కెనరా, యూనియన్ బ్యాంక్, BOB, ఇండియన్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, PNB, BOI, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కానున్నాయి.
News October 23, 2025
నేడు భగినీ హస్త భోజనం

5 రోజుల దీపావళి పండుగలో చివరిది భగినీ హస్త భోజనం. ‘భగిని’ అంటే సోదరి అని అర్థం. ఆమె చేతి భోజనం సోదరుడికి దైవ ప్రసాదంతో సమానం. పురాణాల ప్రకారం.. ఈ పండుగను యమునా దేవి తన సోదరుడు యముడితో కలిసి నిర్వహించింది. అందుకే నేడు అన్నాచెల్లెల్లు/అక్కాతమ్ముళ్లు కలిసి ఆప్యాయంగా కొద్ది సమయం గడుపుతారు. ఇది అకాల మరణం నుంచి తప్పిస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం వెనుక బంధాలను బలోపేతం చేసే కారణం కూడా ఉంది.
News October 23, 2025
అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే ఫ్యాక్ట్ చెక్

భారత రైల్వేకు సంబంధించి అసత్య ప్రచారానికి చెక్ పెట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్ చెక్ను తీసుకొచ్చింది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు X హ్యాండిల్ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. రైల్వేల గురించి తప్పుదారి పట్టించే లేదా తప్పుడు సమాచారం కనిపిస్తే <