News September 11, 2024

మరోసారి ఢిల్లీకి రేవంత్.. ఈసారి క్యాబినెట్ విస్తరణ ఖాయమేనా?

image

TG: క్యాబినెట్ విస్తరణపై పలుమార్లు ఢిల్లీ వెళ్లిన CM రేవంత్ ఇవాళ మరోసారి హస్తిన బాట పట్టారు. రేపు కాంగ్రెస్ హైకమాండ్‌తో ఆయన భేటీ కానున్నారు. పీసీసీ చీఫ్ నియామకం పూర్తవడంతో మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సహా 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా మరో 6 బెర్తులున్నాయి. దీంతో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠకు మరికొద్ది రోజుల్లో తెరపడనుంది.

Similar News

News November 23, 2025

వన్డేలకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన టీమ్ ఇండియా

image

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.

News November 23, 2025

ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

image

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’‌కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.

News November 23, 2025

భారీ జీతంతో 115 ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి B.Tech, BE, MSc, MCA ఉత్తీర్ణత, వయసు 22-45 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://bankofindia.bank.in/