News August 29, 2024

రేవంత్ ఓటుకు నోటు కేసు: 2PMకు సుప్రీం ఆదేశాలు

image

TG CM రేవంత్ రెడ్డి ‘ఓటుకు నోటు కేసు’ విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ విచారణను తెలంగాణ నుంచి భోపాల్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న BRS పిటిషన్‌పై వాదనలు విన్నది. TG సహచరులను సంప్రదించి 2PMకు ఆదేశాలు ఇస్తామంది. బదిలీ పిటిషన్లను విచారిస్తే తమ న్యాయ అధికారులను తామే నమ్మనట్టు అవుతుందని పేర్కొంది. CM వద్దే హోం బాధ్యతలు ఉన్నాయని BRS లాయర్లు ఇందుకు బదులిచ్చారు.

Similar News

News November 28, 2025

ప్రకృతి వ్యవసాయంతో బహుళ ప్రయోజనం: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు సాధించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కలెక్టర్‌ మహేశ్ కుమార్ తెలిపారు. అంబాజీపేట మండలం ముక్కామలలో శుక్రవారం జరిగిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. దీనివల్ల రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

News November 28, 2025

స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

image

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>

News November 28, 2025

128 మంది మృతి.. కారణమిదే!

image

హాంగ్‌కాంగ్‌లోని అపార్ట్‌మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్‌మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.