News March 27, 2025

రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR

image

TG: ఎవ్వరు ఏమనుకున్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని BRS ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తెలంగాణ బూతుపిత అవుతారని ఎద్దేవా చేశారు. తుపాకుల గురించి రేవంత్‌కు తెలిసినంత తమకు తెలియదన్నారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ప్రజాపాలన విఫల పాలన అని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు, అబద్దాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణ రైజింగ్ అని విమర్శలు చేశారు.

Similar News

News October 29, 2025

లొంగిపోయిన మావోయిస్టులకు రూ.9.50 లక్షల రివార్డు

image

భద్రాద్రి: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు సభ్యులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రివార్డును ఎస్పీ రోహిత్ రాజు బుధవారం అందజేశారు. ఈ ముగ్గురు సభ్యులకు ఆయన రూ.9.50 లక్షల నగదును చెక్కుల రూపంలో అందించారు. రివార్డులు అందుకున్న వారిలో రామ్ సింగ్ కౌడే, ముచ్చికి సోందాల్, సోడి భీమే ఉన్నారు.

News October 29, 2025

అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

image

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.

News October 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 50 సమాధానాలు

image

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ‘బృందా దేవి’.
2. త్రిపురాంతకుడు అంటే ‘పరమ శివుడు’.
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరిన దేవుడు ‘ఇంద్రుడు’.
4. వాక్కుకు అధిష్టాన దేవత వాగ్దేవి. అంటే సరస్వతీ దేవి.
5. పరశురాముడు తన తల్లి తలను తండ్రి ‘జమదగ్ని’ ఆజ్ఞ మేరకు నరికాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>