News July 14, 2024
ఉద్యోగాలు ఇచ్చేవరకూ రేవంత్‌ను వదలం: కేటీఆర్

TG: రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకూ సీఎం రేవంత్ రెడ్డిని వదలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. కానీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. రేవంత్, రాహుల్ మాత్రమే ఉద్యోగం తెచ్చుకున్నారు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’ అని ఆయన భరోసా ఇచ్చారు.
Similar News
News January 30, 2026
కోహ్లీ ఎక్కడంటూ SMలో అనుష్కకు ప్రశ్నలు

విరాట్ కోహ్లీ <<18998052>>Insta<<>> అకౌంట్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన వెరిఫైడ్ అకౌంట్ ‘Profile isn’t available’గా చూపిస్తోంది. దీనిపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఆయన భార్య అనుష్క శర్మను ప్రశ్నిస్తున్నారు. “వదినా, అన్న అకౌంట్ ఎక్కడ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా కనిపించడం లేదు. కోహ్లీ ‘X’ అకౌంట్ మాత్రం యాక్టివ్‌గా ఉంది.
News January 30, 2026
KCRకు మరోసారి నోటీసులు!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS అధినేత KCRకు ఇవాళ సిట్ <<18998286>>మరోసారి<<>> నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో నోటీసులు ఇస్తారా? ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో అందిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న నందినగర్ నివాసంలో సిట్ నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరగా, KCR అభ్యర్థన మేరకు నేడు మినహాయింపు ఇచ్చారు.
News January 30, 2026
CSIR ఇన్నోవేషన్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు

ముంబైలోని <


