News August 22, 2025
ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ కృషి అభినందనీయం: చిరంజీవి

ఇండస్ట్రీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి, అటు నిర్మాతలు, ఇటు కార్మికులకు సమన్యాయం చేసిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఇండస్ట్రీ అభివృద్ధికి రేవంత్ చర్యలు అభినందనీయం. ప్రపంచ చలనచిత్ర రంగానికే హైదరాబాద్‌ను ఓ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారు. టాలీవుడ్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 22, 2025
నాగవంశీపై ట్రోల్స్.. ఆర్జీవీ రియాక్షన్ ఇదే

ప్రముఖ నిర్మాత నాగవంశీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. ‘నాగవంశీ ఓ దయగల ప్రొడ్యూసర్. ట్రోల్స్ ఆయనను ఎప్పటికీ కిందకు లాగలేవు. పది రెట్ల వేగంతో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు’ అంటూ పేర్కొన్నారు. కాగా ‘కింగ్డమ్’, ‘వార్2’ సినిమాల వల్ల నాగవంశీకి భారీ నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరగడంతో నెటిజన్లు అతడిపై ట్రోల్స్‌కు దిగుతున్న విషయం తెలిసిందే.
News August 22, 2025
EP-43: ధనవంతులయ్యే మార్గాలు ఇవే: చాణక్య నీతి

కొంతమంది ఎంత కష్టపడినా ధనవంతులు కాలేరు. ధనవంతులు అయ్యేందుకు కొన్ని పద్ధతులు పాటించాలని చాణక్య నీతి చెబుతోంది. ‘ఎల్లప్పుడూ నిజాయితీగా డబ్బు సంపాదించాలి. ఇలాంటి డబ్బు మాత్రమే ఎప్పటికీ నిలుస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా అది మీ నియంత్రణలోనే ఉండాలి. అనవసర వస్తువులపై ఖర్చు చేయకూడదు. డబ్బును తెలివిగా ఖర్చు పెట్టాలి. ఇలా చేస్తే మీ చెంతకే సక్సెస్ వస్తుంది’ అని తెలుపుతోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 22, 2025
పెన్షన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: సదరం సర్టిఫికెట్ల పున:పరిశీలనలో ఏ ఒక్క దివ్యాంగుడికి అన్యాయం జరగకూడదని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందేవారికి ఎప్పటిలా పింఛన్ అందించాలని ఆదేశించారు. పెన్షన్లపై ఉన్నతాధికారులతో CM సమీక్ష నిర్వహించారు. ‘అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు పొందినవారిపై ఖచ్చితమైన పరిశీలన చేయాలి. అవసరమైతే దివ్యాంగులకు పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి’ అని ఆదేశించారు.