News August 5, 2025
కేసీఆర్‌ను హింసించడమే రేవంత్ ఉద్దేశం: హరీశ్ రావు

TG: కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై కమిషన్ల పేరుతో రేవంత్ రెడ్డి వరుస సీరియళ్లు నడుపుతున్నారని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు దుయ్యబట్టారు. ఎలాగైనా కేసీఆర్‌ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశమని ఫైరయ్యారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడం తప్ప రాష్ట్రానికి సీఎం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టకుండా చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లకు నీళ్లు ఇవ్వాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు.
Similar News
News August 5, 2025
ఈ బామ్మకు 114 ఏళ్లు.. హెల్త్ సీక్రెట్ ఇదే!

114 ఏళ్ల షెగేకో కగవా జపాన్‌లో అత్యంత ఎక్కువ వయసున్న వృద్ధ పౌరురాలిగా గుర్తింపు పొందారు. ఈమె గైనకాలజిస్టుగా పని చేసి 86 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యారు. ‘నేను డ్యూటీ చేసినప్పుడు ఇప్పుడు ఉన్నంతగా కార్లు లేవు. రోజూ నడుచుకుంటూ వెళ్లేదాణ్ని. అందుకే ఆరోగ్యంగా ఉన్నానేమో. నాకిష్టమైనవి తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తింటాను. నాలో చాలా ఎనర్జీ ఉంది’ అని చెప్పారు. కగవా 1911లో జన్మించారు.
News August 5, 2025
జైపూర్‌లో ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ.. ఎందుకొచ్చారంటే?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలీనా వొలోడిమిరివ్నా మొన్న జైపూర్‌కు వచ్చి వెళ్లారు. ఆమె జపాన్ టూరుకు వెళ్తున్న క్రమంలో విమానంలో ఫ్యూయెల్ అయిపోయింది. దీంతో ఆ ఫ్లైట్‌ను జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఇంధనం నింపే వరకు ఆమె ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో వెయిట్ చేశారు. ఆమె వెంట ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి, ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
News August 5, 2025
లాయర్ నుంచి గవర్నర్ దాకా..!

మాజీ గవర్నర్ <<17309774>>సత్యపాల్ మాలిక్<<>> 1946 జులై 24న యూపీలోని హిసవాడలో జన్మించారు. ఈయనది జాట్ కుటుంబం. మీరట్ యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేసి కొద్దిరోజులు ప్రాక్టీస్ చేశారు. 1980-89 మధ్య రాజ్యసభ, 1989-91 మధ్య లోక్‌సభ(అలీఘడ్)కు ప్రాతినిధ్యం వహించారు. జమ్మూ కశ్మీర్ చివరి గవర్నర్ సత్యపాల్ కావడం విశేషం.