News February 10, 2025

భూములు గుంజుకోవడమే రేవంత్ పని: కేటీఆర్

image

TG: సీఎం రేవంత్ ప్రజల కోసం పనిచేయడం లేదని, వారి భూములను ఎలా గుంజుకోవాలనే ఆలోచిస్తున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్‌లో జరుగుతున్న BRS రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ‘ఏడాదిగా రాష్ట్రంలో కౌరవ పాలన సాగుతోంది. కొడంగల్‌లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. రేవంత్ సోదరులు కొడంగల్ భూములపై కన్నేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా కాంగ్రెస్ చేసిందేమీ లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News March 27, 2026

165 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయనున్న ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. US 250వ స్వాతంత్య్ర దినోత్సవం(4-7-2026) సందర్భంగా కొత్తగా ముద్రించే డాలర్ నోట్లపై ఆయన సైన్ చేయనున్నారు. 1861 నుంచి కరెన్సీ నోట్లపై ట్రెజరర్ సంతకమే ఉంటుండగా ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న తొలి ప్రెసిడెంట్‌గా ట్రంప్ నిలుస్తారు. 250వ ఇండిపెండెన్స్‌ డేకు గుర్తుగా ఇటీవల ట్రంప్ చిత్రంతో 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్‌ నమూనాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

News March 27, 2026

సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల విశిష్టత

image

భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమనిష్టలతో పండించి నూర్పిడి చేసి వడ్లుగా మారుస్తారు. వీటిని గోటితో ఒలిచి బియ్యంగా మార్చి భద్రాచలానికి కాలినడకన వచ్చి అందిస్తారు. వీటికి బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యిని కలుపుతారు. అందుకే ఈ కల్యాణ తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి.

News March 27, 2026

పనస కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పనస పండ్లను చెట్ల నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తొక్కపై కళ్లు పూర్తిగా విచ్చుకొని, లేత పసుపుపచ్చ రంగులోకి మారి వాసన వచ్చే కాయలనే కోయాలి. ఒకసారి కాసిన చోటే మరల కాసే గుణం పనసకు ఉంటుంది. కాబట్టి కాయలను కోసేటప్పుడు కొద్దిగా తొడిమను వదిలి కోయాలి. కోతకు వచ్చిన కాయలను పట్టుకొని గట్టిగా లాగినా, బెరడును గాయపరిచినా కాండం మీద మొగ్గలు దెబ్బతినే అవకాశం ఉంది.