News January 24, 2025

దోచుకున్న సొమ్ము బయటపెట్టు: సోమిరెడ్డి

image

AP: విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు <<15247358>>రాజకీయాల<<>> నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ‘2004-09 వరకు జగన్‌ను ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి. అప్పుడు దోచుకున్న రూ.43వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 13, 2026

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. లీడ్‌లో BNP!

image

బంగ్లాదేశ్‌లో 299 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 55% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. వెంటనే కౌంటింగ్ షురూ చేయగా ఇంకా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పోటీదారు జమాత్ ఇస్లామీ పార్టీకి ఓటర్ల మద్దతు తగ్గినట్లు సమాచారం. మరోవైపు BNP ఛైర్‌పర్సన్, ప్రధాని అభ్యర్థి రెహ్మాన్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

News February 13, 2026

ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

image

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం

News February 13, 2026

టీమ్ ఇండియాకు అతిపెద్ద విజయం

image

నమీబియాతో మ్యాచులో 93 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమ్ ఇండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది. T20 WCలో పరుగులు పరంగా మెన్ ఇన్ బ్లూకు ఇదే అతిపెద్ద విజయం. అంతకుముందు 2012లో ఇంగ్లండ్‌పై 90, 2014లో ఆస్ట్రేలియాపై 73, 2022లో జింబాబ్వేపై 71 రన్స్ తేడాతో గెలిచింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుస విజయాల సంఖ్య 10కి చేరింది. గత మ్యాచులో సౌతాఫ్రికా(8) రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.