News December 3, 2024

ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు

image

AP: ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. గ్రామస్థాయిలో భూవివాదాలను ఈ సమావేశాల్లో పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భూఆక్రమణలు, 22ఏ, ఫ్రీహోల్డ్‌పై ఫిర్యాదులు స్వీకరించనుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News December 4, 2024

హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం: రేవంత్

image

TG: గతంలో CMగా ఎవరున్నా, నంబర్ 2 మాత్రం రోశయ్యదేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYD హైటెక్స్‌లో రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ‘సమయం వచ్చినప్పుడు ఆయనే నం.1 అయ్యారు. రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రం ఏర్పడింది. ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వ్యక్తికి HYDలో విగ్రహం లేకపోవడం బాధాకరం. మేం ఏర్పాటు చేస్తాం’ అని CM చెప్పారు.

News December 4, 2024

‘సీజ్ ద షిప్’ డ్రామా అట్టర్ ఫ్లాప్: YCP

image

‘సీజ్ ద షిప్’ డ్రామా బెడిసికొట్టిందని YCP ఎద్దేవా చేసింది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్, నాదెండ్ల ద్వయం రాద్ధాంతం చేశారంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకర్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి జరుగుతోందని, సమగ్ర తనిఖీల తర్వాతే షిప్‌లోకి బియ్యం లోడింగ్ చేశారని తెలిపింది. రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే అని ఆరోపించింది. మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి షిప్ ఎందుకు తనిఖీ చేయలేదు? అని ‘X’లో ప్రశ్నించింది.

News December 4, 2024

అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన మెగా హీరో

image

భారీ అంచనాలతో రిలీజవుతున్న ‘పుష్ప-2’ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప-2’ టీమ్‌కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్‌ & టీమ్‌కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు రాత్రి నుంచి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.