News November 25, 2024
డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు
AP: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా DEC 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ, మండల స్థాయిలో సభల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి 45 రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. వీటి పర్యవేక్షణకు ఓ సీనియర్ ఐఏఎస్‌ను ప్రతి జిల్లాకు నోడల్ అధికారిగా నియమించనుంది. భూఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యుటేషన్లు, రికార్డుల్లో మార్పులు లాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించనుంది.
Similar News
News November 25, 2024
3 రోజుల్లోనే డబ్బులు జమ: మంత్రి ఉత్తమ్
TG: వచ్చే ఏడాది జనవరి 10 వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఉత్తమ్ సూర్యాపేటలో తెలిపారు. ఇప్పటి వరకు రూ.5,040కోట్ల విలువైన 21.73లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.2,760కోట్లు చెల్లించామన్నారు. కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా 66లక్షల ఎకరాల్లో 153 లక్షల MTల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. విక్రయించిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
News November 25, 2024
అండమాన్ జలాల్లో భారీగా డ్రగ్స్ సీజ్
అండమాన్ జలాల్లో నేడు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఫిషింగ్ బోట్లలో తరలిస్తుండగా 5 టన్నుల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ చరిత్రలోనే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది.
News November 25, 2024
RGV ఇంటికి పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయమే ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. ఆయన విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం. రెండు సార్లు నోటీసులివ్వగా ఆయన గడువు కావాలని కోరిన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవడం విదితమే.