News December 3, 2024
డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు

AP: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహించనుంది. భూ వివాదాలకు పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యల్లో 10శాతం థర్డ్ పార్టీ ద్వారా పరిశీలిస్తామని అనగాని తెలిపారు. అటు గ్రామ సభల్లో ప్రజల ఫిర్యాదులపై రసీదులు ఇస్తామన్నారు.
Similar News
News November 20, 2025
రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. కాగా రాజమౌళి కామెంట్స్ను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు.
News November 20, 2025
సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలుసా?

సావిత్రి తన వాక్చాతుర్యంతో భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకుంది. యముడు తన భర్త ప్రాణాలను తీసుకొని వెళ్తుంటే అడ్డుపడింది. ధర్మబద్ధమైన సంభాషణలతో యముడిని మెప్పించి, 3 వరాలు పొందింది. మూడో వరంగా సత్యవంతుడి ద్వారా 100 మంది పుత్రులు కావాలని కోరింది. యముడు వరమివ్వగానే ‘నా భర్త మీ వెంట ఉంటే, నాకు పుత్రులు ఎలా కలుగుతారు?’ అని ప్రశ్నించింది. భర్త ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడి చేతే భర్తను బతికించుకుంది.
News November 20, 2025
ఈ అలవాట్లతో రోగాలకు దూరం: వైద్యులు

ఆరోగ్య సమస్యలను డైలీ హ్యాబిట్స్ ద్వారా దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘రోజుకు 10వేల అడుగులు నడిస్తే శారీరక & మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి & ఆందోళన తగ్గుతుంది. ఒకే సమయానికి నిద్ర పోవడం & మేల్కోవడం చేయాలి. సూర్యరశ్మి తగిలితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్ను తినకపోవడం బెస్ట్. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి’ అని సూచిస్తున్నారు.


