News June 28, 2024

ఫ్రీ బస్ స్కీమ్ వల్ల రెవెన్యూ పెరిగింది: CM

image

TG: తమ పాలనలో RTC లాభాల్లో నడుస్తోందని CM రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్ర రెవెన్యూ పెరిగిందన్నారు. రాష్ట్రానికి రూ.7లక్షల కోట్ల అప్పు ఉందని, దీనిపై వడ్డీ తగ్గించగలిగితే ప్రభుత్వానికి ఏటా రూ.1000 కోట్లు ఆదా అవుతాయని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM వివరించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ నేత KC వేణుగోపాల్‌తో సమావేశయ్యారు. ఇందులో TPCC చీఫ్ అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉంది.

Similar News

News September 14, 2025

BELలో ఇంజినీర్ పోస్టులు

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 67 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంటెక్/ఎంఈ , ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 14, 2025

ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

image

<>ఏపీ<<>> మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వైద్యారోగ్యశాఖలో 538 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWS, దివ్యాంగులకు రూ.750.

News September 14, 2025

డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

image

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స‌హాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.